కనలేని కనులేలనయ్యా

కనలేని కనులేలనయ్యా
Singer Bro Lakshamanrao
Composer
Music
Song Writer

కనలేని కనులేలనయ్యా
వినలేని చెవులేలనయ్యా
నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా

ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)
అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2)
అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2)
అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2)
అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా            ||కనలేని||

అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2)
ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా            ||కనలేని||


కనలేని కనులేలనయ్యా